Breaking News

ట్రంప్‌పై దాడి.. రీగన్‌ను గుర్తుచేసుకున్న కుమార్తె

Published on Mon, 07/15/2024 - 10:25

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ను అతని కుమార్తె పాటీ డేవిస్‌ గుర్తు చేసుకుని, తన తండ్రి విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.  

రోనాల్డ్ రీగన్‌ 1981లో ఒకరోజు వాషింగ్టన్‌లో తన ప్రసంగం ముగించుకుని తన  నివాసానికి వెళుతుండగా జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీగన్‌ కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ, పాక్షికంగా పక్షవాతానికి గురయ్యడు. రోనాల్డ్ రీగన్ కుమార్తె పాటీ డేవిస్ నటి, రచయిత్రి. ఆమె న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కథనం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

‘అది 1981, మార్చి 30.. నేను నా ఆస్పత్రి కార్యాలయంలో కూర్చున్నాను. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మా ఆఫీసు తలుపును తోసుకుంటూ లోనికి వచ్చాడు. దీంతో అతని మీద నాకు మొదట నాకు కోపం వచ్చింది. అయితే ఏదో జరగరానిది జరిగిందన్న భావన అతని ముఖంలో కనిపించింది. ఇంతలో అతను పాటీ.. అక్కడ కాల్పులు జరిగాయన్నాడు. ఆ రోజు నా జీవితంలో  మరచిపోలేని రోజులలో ఒకటి. నా తండ్రి రోనాల్డ్ రీగన్ బతికి ఉంటారో ఉండరో తెలియదు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా ఈ విషయం తెలియదు. మా అమ్మ.. మా నాన్నను తలచుకుంటూ రోదిస్తోంది. మా నాన్న హాస్పిటల్ బెడ్‌పై  కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.

డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారు అనుభవిస్తున్న వేదన ఎటువంటిదో నాకు తెలుసు. అధ్యక్షుడు లేదా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అమెరికాలో ప్రస్తుతం 1981కి మించిన హింసాత్మక స్థితి ఉంది. ఈ అనుభవం ట్రంప్‌ను ఎలా మారుస్తుందో నేను ఊహించలేను. సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికి, అణ్వాయుధాలపై ఒప్పందాన్ని చేసుకునేందుకు దేవుడు తనను భూమిపైకి పంపాడని నా తండ్రి నమ్మాడు. సమయం అమూల్యమైనది. ఈ బహుమతిని అర్థవంతంగా ఉపయోగించడం అందరికీ తప్పనిసరి అని నాన్న గుర్తు చేసేవారని’ పాటీ డేవిస్ పేర్కొన్నారు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)