Breaking News

పవర్ ప్లాంట్లపై రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సంక్షోభం

Published on Mon, 06/03/2024 - 08:01

ఉక్రెయిన్‌పై రష్యా  నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై  దాడికి దిగింది. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్‌ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని పవర్ ప్లాంట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను చేపట్టంది. దీంతో ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. ఈ దాడుల్లో 19 మందికిపైగా జనం మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో మాట్లాడుతూ రష్యా చేపడుతున్న దాడులతో విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడ్డాయని, ఇవి పారిశ్రామిక, గృహ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్‌అవుట్‌ను విధించేలా చేశాయన్నారు.

గత ఏప్రిల్‌లో కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. మే 8న మరో  పవర్‌ ప్లాంట్‌పై దాడి జరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా  ప్రకటించింది. రష్యా  ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్‌ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సింగపూర్‌లో జరిగిన ఆసియా ప్రధాన భద్రతా శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలో జరగబోయే శాంతి సమావేశానికి అడ్డుపడేందుకు రష్యాకు చైనా సహకారం అందిస్తున్నదని ఆరోపించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)