Breaking News

బంగ్లాదేశ్‌లో మరో నేతపై కాల్పులు

Published on Mon, 12/22/2025 - 16:45

తీవ్ర నిరసనలు, అ శాంతితో భగ్గుమంటున్న బంగ్లాదేశ్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

బంగ్లాదేశ్‌ ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశానికి చెందిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణం ఆ దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఉస్మాన్ మృతితో ఆయన మద్దతుదారులు చెలరేగిపోయారు. ఢాకాలో మీడియా హౌజ్‌లపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అంతే కాకుండా దైవదూషణ చేశారనే నెపంతో ఓ హిందూ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఆదేశంలో నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ అనే నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

దీంతో ఆయనను హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీస్ అధికారి మాట్లాడుతూ " మహమ్మద్ మోతేలాబ్ సికిదార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు" అని తెలిపారు.

మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నాయకుడు. శ్రామిక్ శక్తి విభాగంలో ఈయన సెంట్రల్ ఆర్గనైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఖులానా మెట్రోపాలిటన్ యూనిట్‌లో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులపై కాల్పులు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)