Breaking News

మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!

Published on Thu, 07/13/2023 - 11:01

బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింటిలో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్‌ఎక్స్‌ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్‌వుడ్‌ ఇంటికి మూడు పోలీసు వాహనాలను పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అసలు విషయం తెలుసుకుని ఆశ్చ​‍ర్యపోయారు. 

కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్‌వుడ్స్‌ గత 21 ఏళ్లుగా పక్షులను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులు ఉన్నాయి. వుడ్‌ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం తన వద్ద ఉన్న పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తుంటాయన్నారు. అయితే తన దగ్గర ఫ్రెడీ అనే రామచిలుక ఉన్నదని, దానిలో అత్యధికంగా హార్మోనులు విడుదలవుతాయని, అప్పుడు అది గట్టిగా అరుస్తుందని తెలిపారు. 

పోలీసులు రాగానే తాను కంగారు పడిపోయాయని, తాను ఏమి తప్పు చేశానని వారిని అడిగానని అన్నారు. అప్పుడు వారు ఈ ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చామని, ఇంటిని తనిఖీ చేస్తామని తెలిపారు. వారు తనిఖీ చేసి, అంతా సవ్యంగానే ఉందన్నారు. అప్పుడు తాను అసలు విషయం చెప్పానని, అది రామ చిలుక అరుపు అని వివరించానన్నారు. తన పొరుగింటిలోని వ్యక్తి పోలీసులకు ఫోను చేయడం మంచిదే అయ్యిందని, పోలీసుల తనిఖీతో తన తప్పేమీ లేదని అందరికీ అర్థం అయ్యిందని వుడ్స్‌ తెలిపారు. 
ఇది కూడా చదవండి: టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)