Breaking News

Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు

Published on Mon, 09/16/2024 - 04:20

స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ ప్రాజెక్టు ‘పొలారిస్‌ డాన్‌’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్‌ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్‌ ఇసాక్‌మాన్‌ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్‌ బీచ్‌ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. 

ఇసాక్‌మాన్‌తోపాటు ఇద్దరు స్పేస్‌ఎక్స్‌ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్‌ థండర్‌బర్డ్‌ పైలట్‌ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్‌ ఎక్స్‌ ఇంజనీర్‌ సారా గిలిస్‌ స్పేస్‌వాక్‌ చేశారు. అనంతరం డ్రాగన్‌ క్యాప్సూల్‌ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. 

చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్‌ రంగంలో స్పేస్‌వాక్‌ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్‌ నిలిచారు. ఆయన, గిలిస్‌ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్‌ నుంచి బయటికొచ్చి స్పేస్‌ఎక్స్‌ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్‌ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమా స్టార్‌వార్స్‌ థీమ్‌ సాంగ్‌కు వయోలిన్‌ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే.                        

– కేప్‌ కనావరెల్‌  
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)