Breaking News

ఇరాన్‌పై దాడులు.. నెతన్యాహు సంచలన ప్రకటన

Published on Tue, 11/19/2024 - 14:55

టెల్‌అవీవ్‌:ఇరాన్‌ మీద ఇటీవల జరిపిన దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.ఇరాన్‌ అణు స్థావరాలపై తాము అక్టోబర్‌లోనే దాడి చేసినట్లు నెతన్యాహు తాజాగా అంగీకరించారు.ఈవిషయాన్ని ఆయన దేశ పార్లమెంట్‌లో వెల్లడించారు.

తాము వాటిని ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్‌  అణు కార్యక్రమం మాత్రం ఆగలేదని ఆయన పేర్కొన్నారు.ఇక ఇదే ఏడాది ఏప్రిల్‌లో తాము చేసిన దాడిలో టెహ్రాన్‌ చుట్టూ మోహరించిన మూడు ఎస్‌-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద ఉండగా అక్టోబర్‌లో చేసిన దాడిలో అవి కూడా ధ్వంసం అయ్యాయన్నారు. 

అదే సమయంలో ఇరాన్‌ తన క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామని వెల్లడించారు.ఒకవేళ వీటికి ఇరాన్‌ ప్రతి దాడులు చేస్తే వాటికి కూడా ఎలా స్పందించాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని నెతన్యాహూ తెలపడం గమనార్హం.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ సైనిక స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.అయితే దాడుల సమయంలో అణుస్థావరాల విషయం ‍ప్రస్తావనకు రాలేదు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)