Breaking News

గయానాతో 10 ఒప్పందాలు

Published on Thu, 11/21/2024 - 05:24

జార్జిటౌన్‌: పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకో వాలని భారత్, గయానా నిర్ణయించాయి. వ్యవసాయం, హైడ్రోకార్బన్లు మొదలుకుని ఫార్మా, డిజిటల్‌ పేమెంట్ల దాకా 10 రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైనికంగా గయానాకు కీలక మద్దతు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం గయానా చేరుకున్న ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది. 

జార్జిటౌన్‌ విమానాశ్రయంలో అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ, పలువురు మంత్రులు మోదీని స్వయంగా స్వాగతించారు. గత 56 ఏళ్లలో అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. తన పర్యటనతో ఇరు దేశాల మైత్రీ బంధం సుదృఢమవుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. గయానాలో జన్‌ ఔషధీ కేంద్రం ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించారు. 

ఇరు దేశాల సంబంధాల్లో మోదీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇర్ఫాన్‌ అలీ అన్నారు. ఆయన్ను నేతల్లో చాంపియన్‌గా అభివర్ణించారు. మోదీ పాలన తీరు అద్భుతమన్నారు. భేటీ అనంతరం నేతలిద్దరూ మొక్కలు నాటారు. గయానా, గ్రెనెడా, బార్బడోస్‌ ప్రధాను లు కూడా మోదీతో భేటీ అయ్యారు. తర్వాత గయానాలోని భారతీయులతో ప్రధాని భేటీ అయ్యారు. 185 ఏళ్ల కింద అక్కడికి వలస వెళ్లిన భారతీయులు ఇప్పటికీ దేశ పతాకను సగర్వంగా రెపరెపలాడిస్తున్నారంటూ ప్రశంసించారు. గయానాలో 3.2 లక్షల మందికి పైగా ఎన్నారైలున్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)