Breaking News

వచ్చే నెలలో అమెరికాకు మోదీ

Published on Thu, 08/14/2025 - 05:58

ఐక్యరాజ్యసమితి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 9 నుంచి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 23 నుంచి 29 దాకా జనరల్‌ డిబేట్‌ జరుగుతుంది. ఈ  కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. డిబేట్‌లో ప్రసంగించేవారి పేర్ల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఇందులో మోదీ పేరును సైతం చేర్చారు. సంప్రదాయం ప్రకారం తొలుత బ్రెజిల్, తర్వాత అమెరికా అధినేత ప్రసంగిస్తారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే నెల 23న యూఎన్‌జీఏ పోడియం నుంచి ప్రసంగించబోతున్నారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో చేయబోతున్న తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం. సెప్టెంబర్‌ 26న మోదీ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ నేతలు కూడా మాట్లాడుతారు. మరోవైపు అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. భారత ఉత్పత్తులపై విధించిన 50 శాతం సుంకాలపై ట్రంప్‌తో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)