Breaking News

విశ్వసనీయ మిత్రదేశం

Published on Wed, 04/23/2025 - 02:56

జెడ్డా: ‘‘భారత్‌–సౌదీ అరేబియా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అందుకు నా పర్యటన దోహదపడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆహా్వనం మేరకు ఆయన మంగళవారం సౌదీలో పర్యటించారు. మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆరు ఎఫ్‌–15 ఫైటర్‌ జెట్లు ఎస్కార్ట్‌గా నిలవడం విశేషం. సంబంధిత వీడియోను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది.

మోదీకి లభించిన అపూర్వ ఆహ్వనం భారత్‌–సౌదీ అరేబియా మధ్య బలపడుతున్న రక్షణ సహకారానికి ప్రతీక అని పేర్కొంది. ఎయిర్‌పోర్టు నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. సౌదీ గాయకుడు హషీం అబ్బాస్‌ ‘ఆయే వతన్‌ మేరే ఆబాద్‌ రాహే తూ’ హిందీ పాటను చక్కగా ఆలపించారు. మోదీ చప్పట్లతో ఆ గాయకుడిని అభినందించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులతో ఆప్యాయంగా మాట్లాడారు.

సౌదీ యువరాజు నా సహోదరుడు  
భారత్‌కు సౌదీ అత్యంత విలువైన,  విశ్వసనీయమైన మిత్రదేశమని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మంగళవారం ‘అరబ్‌ న్యూస్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని రెండు దేశాలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు