Breaking News

ఐరాస సమావేశానికి ప్రధాని మోదీ .. ట్రంప్‌తో ముఖాముఖీ?

Published on Wed, 08/13/2025 - 09:18

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.

భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్‌జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్‌ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.

గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య  సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్‌ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.
 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)