Breaking News

సెమీకండక్టర్‌ రంగం  అత్యంత కీలకం

Published on Sat, 08/30/2025 - 09:36

టోక్యో:  ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో షింకాన్సెన్‌ బుల్లెట్‌ రైలులో ప్రయాణించారు. జపాన్‌ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో కలిసి రాజధాని టోక్యో నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని సెండాయ్‌కి చేరుకున్నారు. అక్కడ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ తొలి రోజు శుక్రవారం ఇషిబాతో సమావేశమై, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు శనివారం టోక్యో ఎల్రక్టాన్‌ లిమిటెడ్‌–మియాగీ(టెల్‌ మియాగీ)ను సందర్శించారు. సెమీకండక్టర్ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా మారింది. సెమీకండక్టర్ల తయారీలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, జపాన్‌ ఇప్పటికే నిర్ణయానికొచ్చాయి. 

 

భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు జపాన్‌ సాంకేతిక సహకారం అందించనుంది. అలాగే 508 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు జపాన్‌ సహకరించేలా ఒప్పందం కుదిరింది. సెండాయ్‌లో మోదీ గౌరవార్థం ఇషిబా ప్రత్యేక విందు ఇచ్చారు. ఇండియా–జపాన్‌ మధ్య సహకారంలో సెమీకండక్టర్‌ రంగం అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. 

టోక్యో ఎల్రక్టాన్‌ ఫ్యాక్టరీలో ట్రైనింగ్‌ రూమ్, ప్రొడక్షన్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను సందర్శించానని, అధికారులతో మాట్లాడానని తెలిపారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్, జపాన్‌ గత కొన్నేళ్లుగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల సరఫరాలో టెల్‌–మియాగీ ప్రాధాన్యతను అధికారులు మోదీకి వివరించారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)