Modi China visit : ద్వైపాక్షిక సహకారంతోనే ప్రజా సంక్షేమం: ప్రధాని మోదీ

Published on Sun, 08/31/2025 - 10:29

తియాంజిన్: ‘పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము’ అని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.  ఇరుదేశాల ప్రజల సంక్షేమం ఈ ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉందన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్​సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత  చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు  దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
 

షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరిన ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ.. జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు.

2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో  ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండనుంది.
 

ప్రధాని మోదీ- జిన్‌పింగ్ భేటీలో ముఖ్యాంశాలు

ప్రధాని మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సమావేశం 55 నిమిషాల పాటు కొనసాగింది.

కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది-  ప్రధాని మోదీ

రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా ప్రారంభం కానున్నాయి -  ప్రధాని మోదీ  

శిఖరాగ్ర సమావేశం విజయవంతం అయినందుకు అభినందిస్తున్నాను-  జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ

సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కట్టుబడి ఉన్నాం-  జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ

గత సంవత్సరం కజాన్‌లో అర్థవంతమైన చర్చలు జరిగాయి- ప్రధాని మోదీ 
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)