ఐదేళ్ల తర్వాత భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్‌

Published on Wed, 10/23/2024 - 08:28

బ్రిక్స్‌ 16వ శిఖరాగ్ర సదస్సు పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇవాళ ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఇరువురు నేతలు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ కానుండటం గమనార్హం. 

మరోవైపు.. ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించి కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో మోదీ, జిన్‌ పింగ్‌ మధ్య తాజాగా భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది. గత నాలుగున్నరేళ్లుగా సరిహద్దుల్లో భారత్, చైనాల దేశాల మధ్య ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణతో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

అదీకాక నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు కూడా సాగలేదు. ఇక.. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సమయంలో మొదటిసారి అక్కడ కలిశారు. అనంతరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇక.. అప్పటినుంచి ప్రత్యకంగా  ఇరు దేశాధినేతల మధ్య భేటీ జరగకపోవటం గమనార్హం. 

16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్‌ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్‌ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.

చదవండి: ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)