Breaking News

ఆస్ట్రియాలో ప్రధాని మోదీ.. ‘వందేమాతరం’తో ఘన స్వాగతం

Published on Wed, 07/10/2024 - 08:44

వియన్నా : ప్రధాని మోదీకి ఆస్ట్రియాలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోరోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ బుధవారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో భారతీయులు, ఆస్ట్రియన్స్‌  కళాకారులు వందేమాతరం గీతంతో  మోదీకి ఘనంగా స్వాగతం పలికారు.  
 


41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1983లో ఆ దేశాన్ని సందర్శించిన చివరి ప్రధాని ఇందిరా గాంధీ.

ఇక మోదీ తన పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో కలిసి ఆస్ట్రియా, భారత్‌కు చెందిన వ్యాపార వేత్తలతో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.దీంతో పాటు ఆస్ట్రియాతో పలు ఒప్పందాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

మోదీ పర్యటనపై స్పందించిన నెహమ్మర్‌
ఇక మోదీ పర్యటనపై ఆస్ట్రియా ఛాన్సలర్ నెహమ్మర్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 41ఏళ్లలో తొలిసారి భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. భారత్‌తో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు సందర్భంగా మనం వేడుక జరుపుకుంటున్నాం’ అని నెహమ్మర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో ఆస్ట్రియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్‌తో భేటీ అవుతారని, చాన్స్‌లర్‌తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఇఎఎం) వెల్లడించింది.  

‘మా ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడం, అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై సన్నిహిత సహకారం గురించి మాట్లాడటానికి మాకు ఇదొక గొప్ప అవకాశం’అని ఆస్ట్రియన్ ఛాన్సలర్ నెహమ్మర్‌ అన్నారు.

ధన్యవాదాలు నెహమ్మర్‌
నెహమ్మర్‌ ట్వీట్‌పై మోదీ స్పందించారు. ‘ధన్యవాదాలు, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఆస్ట్రియాను సందర్శించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మన దేశాల మధ్య బంధాలను బలోపేతం చేయడం, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు నేను  ఎదురుచూస్తున్నాను’అని మోదీ రిప్లయి ఇచ్చారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)