Breaking News

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Published on Wed, 03/19/2025 - 09:09

ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్‌(Honduras)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ సంగీతకారుడు ఆరేలియో మార్టినెజ్‌తో సహా 12 మంది దుర్మరణం పాలయ్యారు. రోటన్ ద్వీపం నుండి లా సీబాకు వెళుతున్న  విమానం హోండురాస్ తీరంలో కూలిపోయింది. 

ప్రమాదం సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఐదుగురిని జాలర్లు రక్షించారు. లాన్సా ఎయిర్‌లైన్స్‌(Lansa Airlines)కు చెందిన విమానం రోటన్ ద్వీపం నుండి లా సీబాకు వెళుతుండగా  కూలిపోయింది. విమానం సరిగా టేకాఫ్ కాలేకపోయిందని, దీంతో అది కూలిపోయి, సముద్రంలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో సముద్రంలో ఉన్న జాలర్లు ఐదుగురు విమాన ‍ప్రయాణికులను రక్షించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హోండురాన్ సివిల్ ఏరోనాటిక్స్ ఏజెన్సీ తెలిపింది.

ఆ విమాన ప్రమాదంలో గరిఫునా సంగీతం ప్రాచుర్యానికి విశేష కృషి చేసిన ఆరేలియో మార్టినెజ్ సువాజో  మృతిచెందారు. ఆయన రాజకీయాల్లో కూడా  చురుగ్గా ఉండేవారు. ఆరేలియో మార్టినెజ్ 1969లో హోండురాస్‌లోని ప్లాప్లాయాలో జన్మించాడు. 1990లో అతను సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి, లాస్ గాటోస్ బ్రావోస్ అనే బ్యాండ్‌కు ప్రధాన గాయకునిగా మారారు. ఆరేలియో తొలి ఆల్బమ్ ‘గరిఫునా సోల్’ అతనికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది. 

ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)