Breaking News

ఘోర విమాన ప్రమాదం.. 9 మంది మృతి

Published on Mon, 11/02/2026 - 07:31

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా (తొమ్మిది మంది) మృతి చెందారు. క్రెస్ట్‌హేవెన్‌ సమీపంలో నివాస ప్రాంతంలో ప్రైవేట్‌ జెట్‌ కుప్పకూలింది. సుమారు 8 వేల అడుగుల ఎత్తు నుంచి దక్షిణ ఫ్లోరిడాలోని ఓ నివాస ప్రాంతంలోకి విమానం దూసుకొచ్చింది. టెక్సాస్‌ నుంచి బహామాస్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానం కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో వెలుగులోకి వచ్చింది. పైలట్ తొలుత విమానంపై మంచు పేరుకుపోయిందని చెప్పినట్లు వినిపించింది. అయితే, ఆ తర్వాత విమానం వేగంగా కిందికి దిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే విమానం నేలను ఢీకొట్టబోతోందని సిబ్బంది భయంతో అరిచినట్లు ఆడియోలో వెల్లడైంది.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం అత్యంత వేగంతో, తీవ్ర వాలుతో నేలను ఢీకొట్టిన వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో విమాన శకలాలు, రోడ్డుపై ధ్వంసమైన భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటి చుట్టూ మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. విమాన ప్రమాదం ఇళ్లకు, కార్లకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే, నేలపై ఉన్నవారెవరూ ప్రాణాలు కోల్పోలేదని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ వెల్లడించారు.

ఇదీ చదవండి: వారెన్ బఫెట్ గత 48 ఏళ్లుగా నీళ్లు తాగలేదట..!

 

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)