Breaking News

భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్‌!

Published on Mon, 06/08/2026 - 06:38

ఒక్కసారిగా భూమి కంపించింది. క్షణాల్లో భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రత భూకంపం వణికించగా.. ఇప్పుడు అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. ఎందుకంటే భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (GFZ) ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఉపరితలానికి అత్యంత సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా నమోదైంది.

మొదట భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన అధికారులు.. ఆ తర్వాత 7.8గా, అనంతరం 8.2గా సవరించారు. దీంతో ఇది ఇటీవలి కాలంలో పసిఫిక్‌ ప్రాంతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా మారింది.

కూలిన భవనాలు.. పరుగులు తీసిన ప్రజలు
భూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్‌ సాంటోస్‌ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్‌, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఒకరు మృతి.. పలువురికి గాయాలు
తాజా సమాచారం ప్రకారం కనీసం ఒకరు మృతి చెందగా, నలుగురికి పైగా గాయపడ్డారు. సరంగాని ప్రావిన్స్‌లోని అలాబెల్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. "ఇటీవలి సంవత్సరాల్లో మేము అనుభవించిన అత్యంత బలమైన భూకంపం ఇదే" అని స్థానిక అధికారులు తెలిపారు.

సునామీ భయం
భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్‌ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్‌కు పైగా ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వేలాది మందిని తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండోనేషియా కూడా తన ఈశాన్య తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.

రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లోనే ప్రమాదం
ఫిలిప్పీన్స్‌ "పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌"గా పిలిచే అత్యంత భూకంప ప్రబల ప్రాంతంలో ఉంది. భూమి టెక్టానిక్‌ ఫలకాలు కలిసే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.

ఇప్పుడు అందరి చూపు సముద్రంపైనే
భూకంపం వల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుడు సునామీ ముప్పే అధికారులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. సముద్ర మట్టంలో మార్పులను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగే వరకు తీరప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

 

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)