Breaking News

పాక్‌లో ఇంధ‌న సంక్షోభం.. లీట‌ర్ పెట్రోల్ 400 పైమాటే!

Published on Sat, 09/19/2026 - 23:40

పాకిస్థాన్లో భారీ ఇంధన సంక్షోభం నెలకొంది. శుక్రవారం రాత్రి ప్రకటించిన తాజా ధరల సవరణ ప్రకారం.. పెట్రోల్ ధర లీటర్ కు రూ.390.79కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర లీటర్‌కు రూ.424.92గా ఉంది. ఈ ధరల్లో ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాలు కూడా ఉన్నాయి. పెట్రోల్పై లీటర్కు రూ.114, డీజిల్‌పై లీటరు రూ.100 చొప్పున పన్నులు, సుంకాలు ఉన్నట్లు డాన్ నివేదించింది.

పశ్చిమాసియా యుద్ధం మొదలైన దగ్గర నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా హౌతీలు సౌదీపై దాడులు ఉధృతం చేయడంతో ప్రస్తుతం చమురు సంక్షోభంగా మరింత కఠినంగా మారింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇంధన ధరలు భారీగా పెంచేసింది. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష పీటీఐ నేతలు గాడిద బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు.

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. పెట్రోల్ ధరలు రూ.400కు చేరువ కావడాన్ని నిరసిస్తూ సింధ్ అసెంబ్లీకి గాడిద బండ్లపై వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పెట్రోల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డాన్ నివేదిక ప్రకారం.. PTI నేత సజ్జాద్ అలీ సూమ్రో నేతృత్వంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సింధ్ అసెంబ్లీకి సమీపంలోని ప్రాంతాల నుంచి గాడిద బండ్లపై ప్రయాణించారు. 

అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు చేరుకున్న వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై సజ్జాద్ అలీ తీవ్రంగా స్పందించారు. ప్రజలపై ప్రభుత్వం 'పెట్రోల్ బాంబు' వేసిందని విమర్శించారు. పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "పెట్రోల్ ధర ఎంతగా పెరిగిందంటే.. మా వాహనాల్లో అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నాం. ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు” అని సజ్జాద్ అలీ పేర్కొన్నట్లు డాన్ నివేదించింది.

ఇదీ చదవండి: బ‌ట్ల‌ర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)