Breaking News

నేపాల్‌లో కొత్త సంక్షోభం: ‘ప్రాణాల మీదకొస్తేనే పాస్‌పోర్ట్’..

Published on Sat, 11/15/2025 - 13:06

ఖాట్మండు: నేపాల్‌ను పాస్‌పోర్ట్‌ల సంక్షోభం కుదిపేస్తోంది. పాస్‌పోర్ట్‌లను ముద్రించి అందిస్తున్న ఫ్రెంచ్ కంపెనీ ఇడెమియాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవడంలో జాప్యం జరగడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.  ఇడెమియా కంపెనీతో ఒప్పందం 2025 డిసెంబర్ 21తో ముగియనుంది. తదుపరి జర్మన్ కంపెనీలైన వెరిడోస్, ముహెల్‌బౌర్ ఐడీ సర్వీసెస్ 2026 మార్చి 9 నుండి పాస్‌పోర్ట్‌లను సరఫరా చేయనున్నాయి. దీంతో ఈ రెండింటి మధ్య కాలంలో పాస్‌పోర్ట్‌లను ఎలా అందించాలనేది నేపాల్‌ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

ఇడెమియా ప్రస్తుతం ఒక్కో పాస్‌పోర్ట్‌ను $10.13(రూ.898.39)కు అందిస్తుండగా, కొత్త జర్మన్ కాంట్రాక్టర్లు $8.61(రూ.763.50)కే అందించనున్నారు. ఈ ధర వ్యత్యాసం కారణంగా, నేపాల్‌ సర్కారుకు తక్షణ ఏం చేయాలో తోచడం లేదు. అయితే ఒప్పందం ముగిసిన తర్వాత పాస్‌పోర్టులు కావాలంటే అధిక మొత్తాన్ని చెల్లించాలని, లేదా అవసరానికి మించి ఒక మిలియన్ పాస్‌పోర్ట్‌లను కొనుగోలు చేయాలని ఇడెమియా  మెలికపెట్టింది. అయితే ఒక మిలియన్ పాస్‌పోర్ట్‌లను కొనుగోలు చేస్తే, కొత్త ఒప్పందం కంటే సుమారు $152,000(రూ.1,34,79,360) అదనపు భారం పడుతుంది. చౌకగా లభించే కొత్త కాంట్రాక్ట్ ఉన్నప్పుడు పాత కంపెనీకి ఎక్కువ ధర ఇవ్వడం లేదా అధిక సంఖ్యలో కొనడం వంటి చర్యలు అధికార దుర్వినియోగం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇది దర్యాప్తు కమిషన్ (సీఐఏఏ) విచారణకు దారితీస్తుందనే భయం సంబంధిత అధికారుల్లో నెలకొంది.

అయినప్పటికీ పాస్‌పోర్ట్‌ల కొరతను నివారించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమస్యకు వచ్చే వారం నాటికి చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొంటామని పాస్‌పోర్ట్ విభాగం డైరెక్టర్ జనరల్ హామీ ఇచ్చారు. అలాగే, కొత్త జర్మన్ కంపెనీలు ఒప్పందపు తేదీ అయిన మార్చి 9 కంటే ముందుగానే, అంటే ఫిబ్రవరి మధ్య నుంచే పాస్‌పోర్ట్‌లను అందించేలా చర్చలు జరిగాయన్నారు. ప్రస్తుతానికి అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి, వైద్య చికిత్స కోసం వెళ్లేవారికి ప్రాధాన్యత ఇస్తూ పాస్‌పోర్ట్‌లను అందిస్తున్నారు. ఫిబ్రవరి మధ్య నుండి కొత్త పాస్‌పోర్ట్‌ల ముద్రణ క్రమం తప్పకుండా జరిగితే, కొరత సమస్య ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్‌ షాక్‌‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)