Breaking News

అమెరికాలో బస్సు హైజాక్‌ కలకలం

Published on Wed, 09/25/2024 - 17:17

వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్‌ హైజాక్‌ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్‌ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పలు అమెరికన్‌ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్‌ అలమెడా స్ట్రీట్ సమీపంలో  నిందితులు బస్సును హైజాక్‌ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

హైజాక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్‌, ప్రయాణికులు, హైజాకర్స్‌ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్‌ నుంచి డ్రైవర్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్‌ గురించి  మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. 

ఈ ఏడాది మార్చిలో సైతం
ఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్‌టౌన్‌లో బస్సును నిందితుడు బస్సును హైజాక్‌ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్‌ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. 

 

 

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)