Breaking News

పాలస్తీనా ఖైదీలకిచ్చే ఆహార నాణ్యత పెంచండి 

Published on Tue, 09/09/2025 - 06:42

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలోని పాలస్తీనియన్ల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలకు సరిపోను ఆహారం సైతం అందివ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వారికిచ్చే ఆహార పరిమాణాన్ని, ఆహార నాణ్యతను కూడా పెంచాలని అధికారులను ఆదేశించింది. 

ప్రభుత్వ విధానాలపై సుప్రీంకోర్టు జోక్యం కేవలం సలహాలకు మాత్రమే పరిమితం. అయినప్పటికీ, ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య జరిగే యుద్ధంపై తొలిసారిగా సుప్రీంకోర్టు స్పందించడం విశేషం. పాలస్తీనా ఖైదీలకు కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడాన్ని ఒక విధానంగా అధికారులు అమలు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్‌కు చెందిన మానవ హక్కుల సంస్థలు ఇచి్చన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.

 ఖైదీల ప్రాథమిక మనుగడకు రోజులో మూడు భోజనాలు అందించడం ప్రభుత్వ చట్టపరమైన విధి అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అధికారులు అమలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, అసోసియేషన్‌ ఫర్‌ సివిల్‌ రైట్స్‌ ఇన్‌ ఇజ్రాయెల్‌(అక్రి), ఇజ్రాయెలీ రైట్స్‌ గ్రూప్‌ గిషాలు గతేడాది వేసిన పిటిషన్‌పై విచారణకు సైతం తాజాగా అంగీకరించింది. దీనిని అనూహ్య పరిణామంగా పేర్కొంటున్నారు.

 ఇజ్రాయెల్‌ జైళ్లలోని ఖైదీలకు అందించే ఆహారంపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు పెడుతోందని, వారిని ఆకలి చావులకు గురిచేస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు...‘మేం సుఖవంతమైన లేదా విలాసవంతమైన జీవనం గురించి మాట్లాడటం లేదు. చట్ట ప్రకారం మనిషి మనుగడకు అవసరమైన ప్రాథమిక పరిస్థితుల కల్పనపైనే మాట్లాడుతున్నాం’అని పేర్కొంది. 

అత్యంత దుర్మార్గులైన మన శత్రువుల మాదిరిగా మనం వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్‌ 7వ తేదీ నుంచి గాజాలోని హమాస్‌ శ్రేణులు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు మొదలయ్యాక.. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో కనీసం 61 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో 17 ఏళ్ల పాలస్తీనా వాసి చనిపోయాడు. ఆకలి బాధతోనే ఇతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు రూలింగ్‌పై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇటమర్‌ బెన్‌ గ్విర్‌ తీవ్రంగా స్పందించారు. జడ్జీలు అసలు ఇజ్రాయెలీయులేనా? అని ప్రశ్నించారు.

 ఒక వైపు గాజాలోని ఇజ్రాయెల్‌ బందీలకు సాయం చేసే వారే లేకపోగా, హమాస్‌కు సుప్రీంకోర్టు మద్దతు పలకడం సిగ్గు చేటన్నారు. చట్ట ప్రకారమే జైళ్లలో కనీస పరిస్థితులను కలి్పస్తున్నామని, ఇందులో ఎటు వంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధికా రులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్రి డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెల్‌ జైళ్లు టార్చర్‌ క్యాంపుల్లాగా మారరాదని పేర్కొంది. ‘ప్ర భుత్వం ప్రజలను ఆకలిబాధకు గురి చేయరాదు. ప్రజలు ప్రజలనే చంపుకుంటారా? వాళ్లు ఎలాంటి నేరానికి పాల్పడ్డారనేది తర్వాతి విషయం’అని స్పష్టం చేసింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)