Breaking News

Pakistan: జెండాలు విక్రయిస్తున్న దుకాణంపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

Published on Wed, 08/14/2024 - 13:53

పాకిస్తాన్‌ ఈరోజు(ఆగస్టు 14)న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. అయితే ఈ సమయంలోనూ పాక్‌లో విషాదం చోటుచేసుకుంది.  కొందరు ఉగ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాతీయ జెండాలు విక్రయిస్తున్న దుకాణంతో పాటు ఒక ఇంటిపై గ్రెనేడ్‌లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈ గ్రూప్‌  జాతీయ జెండాలను విక్రయించవద్దని, ఆగస్టు 14న సెలవుదినాన్ని జరుపుకోవద్దని దుకాణాల యజమానులను హెచ్చరించింది. కాగా ఈ దాడిలో గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు  పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందించాలన్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాడులు తీవ్రమయ్యాయి. 2022, 2023లలో కూడా పాక్ జెండాలను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు జరిగాయి. 

#

Tags : 1

Videos

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

50 భాషల్లో కళ్ళు చెదిరేలా మహేశ్ బాబు వారణాసి

సాక్షి ఇంపాక్ట్.. ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్.. ఖోఖో అసోసియేషన్ సంచలన లేఖ

గంటలో 104 మి. మీ వర్షం.. జపాన్ ను ముంచేసిన వరద

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

Photos

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)