Breaking News

భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్‌ మరో మిసైల్‌ ప్రయోగం

Published on Mon, 05/05/2025 - 14:42

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌ ఫతహ్ అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిసైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్‌ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని పాకిస్తాన్‌ ఆర్మీ ప్రకటించింది.  

ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో ఈ మిసైల్‌ టెస్ట్‌ ప్రధానంగా మిస్సైల్‌ హార్డ్‌వేర్‌,సాఫ్ట్‌వేర్‌ పనితీరును పరీక్షించడం, అలాగే మిసైల్‌లో ఉపయోగించిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్తాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిసైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది.

కొనసాగుతున్న ఉద్రిక్తత 
ఈ మిలటరీ చర్యలు పాకిస్తాన్-భారతదేశాల మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ఈ దారుణానికి ఒడిగట్టింది.  

పాక్‌పై భారత్‌ ఆంక్షలు
దీనికి ప్రతిగా, భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.

ఏక్షణంలోనైనా పాక్‌పై భారత్‌ దాడి
ప్రధానమంత్రి మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత సైన్యం పాకిస్తాన్‌పై ఏ క్షణంలో మెరుపు దాడి చేసే దిశగా సన్నాహాలు కొనసాగిస్తోంది.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)