Breaking News

‘ఖులా’ ద్వారా  పెళ్లి రద్దు

Published on Sat, 10/25/2025 - 05:35

ఇస్లామాబాద్‌:  మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేలి్చచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్‌ ధర్మంలో ఒక భాగం. పురుషులకు తలాక్‌ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు ఖులా హక్కు ఉంది. 

ఖులా హక్కును పాక్‌ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్‌ ఆయేషా ఎం.మాలిక్, జస్టిస్‌ నయీం అఫ్గాన్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో శుక్రవారం పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తుండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దుచేసుకున్నారు. అయితే, షెషావర్‌ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది. 

దాంతో పెషావర్‌ హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాంతో బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్‌ హైకోర్టు ఉత్తర్వును తప్పుపట్టింది. ఖులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టంచేసింది. క్రూరత్వం అనేది భౌతికమైన హింస రూపంలోనే కాకుండా మానసికంగానూ ఉండొచ్చని వెల్లడించింది. మానసికంగా హింసిస్తున్న భర్త నుంచి ఖులా ద్వారా విడిపోవచ్చని, అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు వెలువరించింది.  
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)