Breaking News

పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రైవేటీకరణ పూర్తి

Published on Wed, 12/24/2025 - 03:24

ఇస్లామాబాద్‌:పాకిస్తాన్‌ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణలో విజయవంతంగా అమ్ముడుపోయింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఈ సంస్థను 135 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది.

పాకిస్తాన్‌ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్‌ 23, 2025) జాతీయ విమానయాన సంస్థ పీఐఏను ప్రైవేటీకరించింది. ఈ ప్రక్రియలో మూడు సంస్థలు  అరీఫ్ హబీబ్ గ్రూప్, లక్కీ సిమెంట్, ఎయిర్‌బ్లూ పోటీ పడ్డాయి. ప్రారంభ బిడ్డింగ్‌లో అరీఫ్ హబీబ్ రూ.115 బిలియన్, లక్కీ సిమెంట్ రూ.105.5 బిలియన్, ఎయిర్‌బ్లూ రూ.26.5 బిలియన్ ఆఫర్ చేశాయి. ప్రభుత్వ రిఫరెన్స్ ధర రూ.100 బిలియన్‌గా నిర్ణయించబడింది. చివరి దశలో ఓపెన్‌ ఆక్షన్‌లో అరీఫ్ హబీబ్ తన ఆఫర్‌ను పెంచుతూ 135 బిలియన్ రూపాయల వద్ద విజయం సాధించింది.

ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం పీఐఏలోని 75శాతం షేర్లు అరీఫ్ హబీబ్ గ్రూప్‌కు బదిలీ అవుతాయి. మిగిలిన 25శాతం షేర్లను కొనుగోలు చేయడానికి 90 రోజుల గడువు ఇవ్వబడింది.

గత కొన్ని ఏళ్లేగా పీఐఏ భారీ నష్టాల్లో ఉంది. మిస్‌మేనేజ్మెంట్‌, ఆర్థిక సమస్యలు, సేవా ప్రమాణాల లోపం కారణంగా ఈ సంస్థను నిలబెట్టడం కష్టమైంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ జాతీయ విమానయాన సంస్థను పునరుద్ధరించడమే ఈ ప్రైవేటీకరణ లక్ష్యంగా పాక్‌ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. 
అరీఫ్ హబీబ్ గ్రూప్‌ వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.80 బిలియన్ అదనపు పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా విమానయాన సేవలను మెరుగుపరచడం, ఆధునీకరణ చేయడం, అంతర్జాతీయ పోటీకి తగిన విధంగా పీఐఏను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. 

కాగా, పాకిస్తాన్‌ జాతీయ విమానయాన సంస్థ అమ్మకం దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక మలుపు. అరీఫ్ హబీబ్ గ్రూప్‌ ఆధ్వర్యంలో పీఐఏ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)