Breaking News

Pak: న్యూఇయర్‌ వేడుకలపై కఠిన నిషేధం

Published on Fri, 12/29/2023 - 09:17

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలపై కఠిన నిషేధం విధించారు. ఈ ప్రకటనను ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వార్ ఉల్ హక్ కాకర్ స్వయంగా చేశారు. గాజాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారాయన. 

గురువారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని అన్వార్ ఉల్ హక్ కాకర్ ప్రసంగించారు. ‘‘పాక్‌ ప్రజలంతా పాలస్తీనాలో తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకోండి. గాజాలో ఉన్న మన పాలస్తీనా సోదర సోదరీమణులకు సంఘీభావం తెలపాల్సిన సమయం ఇది. నూతన సంవత్సరానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వం కఠినమైన నిషేధం విధించిందని గుర్తించాలి’’ అని అన్నారు. 


గాజాలో ఇప్పటిదాకా 21 వేలమంది  పాలస్తీనియన్లు మృతి చెందారన్న పాక్‌ ప్రధాని.. ఇజ్రాయెల్‌ దాడుల్లో 9 వేల మంది చిన్నారులే మరణించారని గుర్తు చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో నిరాయుధులైన పాలస్తీనియన్లు, అమాయక పిల్లల మారణహోమం పట్ల పాక్‌ సహా యావత్‌ ముస్లిం సమాజం పూర్తి  వేదనలో ఉన్నాయన్నారాయన. 

ఇదిలా ఉంటే.. పాక్‌లో సాధారణంగానే కొత్త సంవత్సరం వేడుకలు మరీ కోలాహలంగా ఏం జరగవు. ఇస్లామిక్‌ గ్రూప్‌ల అభ్యంతరాల నేపథ్యంలో.. పరిమితంగానే జరుగుతుంటాయక్కడ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)