Breaking News

కరాచీ మాల్‌ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు

Published on Thu, 01/22/2026 - 23:35

కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.

ఒకే చోట 30 మంది..
సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ ష‌ట్ట‌ర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి.  మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

అయితే ఈ విషాధ సంఘ‌ట‌న‌లో మరణించిన వారిని గుర్తించడం అధికారుల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భ్య‌మైన 61  మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించిన‌ట్లు  సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒక‌రు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఈ భ‌వ‌నంలో భ‌ద్ర‌త లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథ‌మిక‌ విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)