Breaking News

బ్రాడ్‌పీక్‌పై హిమపాతం 

Published on Sat, 08/01/2026 - 05:47

ఇస్లామాబాద్‌/కఠ్మాండు: పాకిస్తాన్‌లోని బ్రాడ్‌ పీక్‌పై సంభవించిన హిమపాతంతో పదిమందితో కూడిన పర్వతారోహకుల బృందం గల్లంతైంది. కారకోరమ్‌ పర్వతశ్రేణిలోని 8,051 మీ టర్ల ఎత్తయిన బ్రాడ్‌పీక్‌ను బ్రిటిష్‌ స్పెషల్‌ ఫో ర్సెస్‌ మాజీ సభ్యుడు, నేపాలీ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా(43) సారథ్యంలోని 10 మంది పర్వతారోహకుల బృందం అధిరోహించేందుకు ప్రయతి్నంచింది.

 ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో బ్రాడ్‌ పీక్‌పై 7 వేల మీటర్ల ఎత్తులో ఉండగా సంభవించిన హిమపాతంలో చిక్కుకుని ఈ బృందంలోని వారంతా గల్లంతయ్యారు. ఇందులో ఆరుగురు నేపాలీలు కాగా, పాక్, ఒమన్, అమెరికా, చైనాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను వెలికి తీశామని ఆలై్పన్‌ క్లబ్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (ఏసీపీ) ప్రెసిడెంట్‌ మేజర్‌ జనరల్‌ ఇర్ఫాన్‌ అర్షద్‌ తెలిపారు. 

ఈ నలుగురిలో ఒకరు నేపాల్‌ వాసి గురుంగ్‌ కాగా, మరొకరు ఒమన్‌ దేశస్తురాలు నదీరా అహ్మద్‌ అని చెప్పారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉందన్నారు. అన్వేషణలో రెండు పాక్‌ మిలటరీ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని, అయితే వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉందని పేర్కొన్నారు. 

కాగా, ట్రాకింగ్‌ డేటా ప్రకారం పూర్ణా ఇంకా కదులుతూ ఉండవచ్చని పూర్జా వ్యాపార భాగస్వామి అయిన మింగ్మా డేవిడ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాడ్‌ పీక్‌పై హిమపాతం సంభవించినప్పటి నుంచి పూర్జా ట్రాకింగ్‌ పరికరం లొకేషన్‌ మారుతూనే ఉందన్నారు. చైనా సరిహద్దుకు సమీపంలో గిల్గిట్‌–బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఉన్న బ్రాడ్‌ పీక్‌ అధిరోహకులకు అత్యంత సవాళ్లతో కూడిన పర్వతాల్లో ఒకటి.  

ఎవరీ నిర్మల్‌ పూర్జా? 
పూర్జా ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతారోహకుల్లో ఒకరు. 2019లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 8వేల మీటర్లకు మించి ఎత్తున్న 14 శిఖరాలను అధిరోహించి వెలుగులోకి వచ్చారు. పూర్జాకంటే ముందు ఈ రికార్డును దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ చాంగ్‌–హో నెలకొల్పారు. అయితే, ఆయన ఈ ఘనతను సాధించడానికి ఏడేళ్లు పట్టింది. 

పూర్జా సాధించిన ఘనతను ‘14 పీక్స్‌: నథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌’పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ చేశారు. పూర్జా 9 మంది నేపాలీ పర్వతారోహకులతో కలిసి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన కే2 పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. అంతకుముందు పూర్జా బ్రిటిష్‌ సైన్యంలో 16 ఏళ్లు సేవలందించారు. 2018లో మెంబర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ పురస్కారం అందుకున్నారు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)