Breaking News

లవ్‌ గురూగా మారిన పాక్ ప్రధాని!

Published on Wed, 01/03/2024 - 07:25

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ లవ్‌ గురూ!గా మారారు. ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సంబంధాలపై అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు. ఓ వ్యక్తికి 82 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను వివాహమాడవచ్చని సమాధానమిచ్చారు. న్యూఇయర్ సందర్భంగా మాట్లాడిన వీడియో సందేశంలో ప్రజలు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. 

ఓ వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా? అని ఓ వ్యక్తి పాక్ ప్రధాని అన్వర్-ఉల్-హక్‌-కాకర్‌ను అడగగా.. 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సమాధానమిచ్చారు. డబ్బు లేకుండా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏమి చేయాలి అనే మరో ప్రశ్నకు కాకర్ స్పందిస్తూ.. తన జీవితంలో ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. కానీ చాలా మందిని ఆకట్టుకున్నానని  చెప్పారు.

విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు.. 'అనుకోకుండా ప్రేమను పొందవచ్చు.. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు.' అని కాకర్ స్పందించారు. సరైన అత్తగారు లేకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సంక్షోభ నిర్వహణ కోర్సులో చేరాలని ఫన్నీగా చెప్పారు. 

పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్-హక్ కాకర్‌ను ఎంపిక చేశారు. పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి.

ఇదీ చదవండి: వన్‌ ఉమన్‌ షో!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)