Breaking News

పాకిస్తాన్‌లో పోలియో కేసుల కలకలం

Published on Mon, 06/10/2024 - 09:03

పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్‌ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్‌ను వణికిస్తోంది.

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్‌) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్‌ఐసీహెచ్‌)కు తరలించారు. అక్కడ  ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్‌పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.

బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి  వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్‌ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్‌  వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు