Breaking News

ఓటమి ఎఫెక్ట్‌.. పాకిస్థాన్‌ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్‌!

Published on Fri, 02/28/2025 - 12:19

ఇస్లామాబాద్‌: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్‌ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్‌ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్‌, న్యూజిలాండ్‌) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానానికి ప‌రిమిత‌మైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్‌, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు.. పాకిస్థాన్‌ టీమ్‌ ఆట‌తీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆట‌తీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్ర‌ధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్‌లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్‌ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. 

ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్‌ క్రికెట్‌ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్ర‌ద‌ర్శ‌నపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్ర‌స్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు త‌మ ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దును వేటికి ఎలా ఖ‌ర్చుపెడుతుందో తెలుసుకునే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఉంది. పీసీబీలోని కొంద‌రు అధికారులు నెల‌కు ఐదు మిలియ‌న్ల‌కు వ‌ర‌కు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్య‌త‌లను నిర్వ‌ర్తించ‌డంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టు ఆట తీరుపై పార్లమెంట్‌లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ క‌థ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెల‌వ‌కుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫ‌ల్యాల‌కు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్క‌టే కార‌ణం కాద‌ని, పాక్ జ‌ట్టు దేశ‌వాలీ వ్య‌వ‌స్థ పూర్తిగా క్షీణించ‌డం అని వారు చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)