Breaking News

పట్టాలు తప్పిన పాక్‌ రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Published on Sun, 08/17/2025 - 12:36

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాడు లోధ్రాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుండి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు లాహోర్‌కు దాదాపు 400 కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. డిప్యూటీ కమిషనర్ లుబ్నా నజీర్ విలేకరులతో మాట్లాడుతూ  ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్దారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు.
 

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. అధికారులు దెబ్బతిన్న కోచ్‌లను పక్కకు తొలగిస్తున్నారు.  ట్రాక్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పాక్‌లోని పంజాబ్‌లో ఇది మూడవ రైలు ప్రమాదం. కొన్ని రోజుల క్రితం ముసా పాక్ ఎక్స్‌ప్రెస్ రైవిండ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగస్టు ప్రారంభంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నాడు 10 కోచ్‌లు బోల్తాపడి, 30 మంది గాయపడ్డారు. వరుస  రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)