అఫ్గానిస్తాన్‌పై పాక్‌ దాడులు

Published on Sat, 02/28/2026 - 05:18

ఇస్లామాబాద్‌: ఒకప్పటి మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్‌ సైన్యం గురువారం రాత్రి అఫ్గాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు. 

మరో 400 మందికిపైగా గాయపడ్డారు. తాలిబన్లకు చెందిన 27 సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. తొమ్మిది సైనిక పోస్టులను పాక్‌ సైన్యం స్వా«దీనం చేసుకుంది. అలాగే అఫ్గాన్‌లో పలు యుద్ధ ట్యాంకులు సైతం ధ్వంసమైనట్లు సమాచారం. తాలిబన్ల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ వైమానిక దాడులు జరిగాయి. సరిహద్దుల్లో తాలిబన్ల దాడులను తిప్పికొట్టడానికే తాము రంగంలోకి దిగాల్సి వచ్చినట్లు పాక్‌ తేల్చిచెప్పింది.

 అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రారంభించామని పాకిస్తాన్‌ రక్షణ శాఖమంత్రి అసిఫ్‌ ఖవాజా ప్రకటించారు. తమ ఓపిక పూర్తిగా నశించిందని, రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం సాగుతోందని పేర్కొన్నారు. పొరుగుదేశం గుట్టుమట్లు తమకు తెలుసంటూ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘దమా దమ్‌ మస్త్‌ ఖలందర్‌’అనే సూఫీ ఆధ్యాతి్మక గీతాన్ని సైతం ప్రస్తావించారు. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తాము చేయాల్సింది చేసి చూపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు.  
 

పాక్‌ జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయి
అఫ్గాన్‌ తాలిబన్ల తీరుపై పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్‌ నఖ్వీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రిపూట పిరికిపందల్లా పాక్‌పై దాడులకు దిగారని మండిపడ్డారు. సాధారణ పౌరులపై కాల్పులు జరిపారని ఆరోపించారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెప్పామని స్పష్టంచేశారు. తమ దేశభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మరోసారి పాక్‌ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లను హెచ్చరించారు.  

శాంతి పట్ల ఆకాంక్ష బలహీనత కాదు  
పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సైతం స్పందించారు. శాంతి, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకొనే విషయంలో రాజీ పడబోమని ప్రకటించారు. తాలిబన్ల దుశ్చర్య పట్ల తమ సైనిక దళాలు సమగ్రంగా, నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించాయని తెలిపారు. శాంతి పట్ల తమ ఆకాంక్షను బలహీనతగా భావించవద్దని అఫ్గాన్‌ పాలకులకు సూచించారు. తమ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ‘అందనంత దూరంలో ఎవరూ లేరు’అంటూ ఉద్ఘాటించారు. ఎలాంటి దాడులైనా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్‌ సైన్యానికి ఉందని తేలి్చచెప్పారు.    
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)