Breaking News

నాలుగు సెకన్లు.. ఒక్కటే వాక్యం..!

Published on Sat, 09/13/2025 - 06:16

ఐరాస: ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర పరాభయం ఎదురైంది. హమాస్‌ రాజకీయ నాయకత్వమే లక్ష్యంగా ఖతార్‌పై ఇజ్రాయెల్‌ ఇటీవల చేపట్టిన దాడిపై ఐరాసలో చర్చ సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మానవ హక్కుల న్యాయవాది, యూఎన్‌ వాచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయిన హిల్లెల్‌ నోయర్‌ మాట్లాడుతూ..ఖతార్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కలి్పస్తోందని ఆరోపించారు.

 ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు. అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన హమాస్‌ రాజకీయ కార్యాలయం ఖతార్‌లో 2012 నుంచి కొనసాగుతుండటంపై హిల్లెల్‌ నోయర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించడాన్ని సైతం ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో 2011లో పాకిస్తాన్‌లోని రహస్య స్థావరంలో ఉంటున్న అల్‌ ఖాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా అంతమొందించినప్పుడు ఐరాస అప్పటి చీఫ్‌ చివరికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారన్న విషయాన్ని హిల్లెల్‌ గుర్తు చేశారు. 

పాకిస్తాన్, లాడెన్‌ ప్రస్తావన తేవడంతో ఆ దేశ ప్రతినిధి వెంటనే హిల్లెల్‌ ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ్య దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం కలిగించడం ఐరాస సూత్రాలకు విరుద్ధమని వాదించారు. హిల్లెల్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. స్పందించిన ఐరాస మానవ హక్కుల కమిటీ చైర్మన్‌..హిల్లెల్‌ నోయర్‌కు మైక్‌ను పునరుద్ధరించారు. ప్రసంగం ముగించేందుకు కేవలం నాలుగే సెకన్ల సమయముందని తెల్చి చెప్పారు. దీంతో, ఆ లాయర్‌ ఆ సమయాన్నే సరిగ్గా వినియోగించుకుంటూ.. మిస్టర్‌ ప్రెసిడెంట్, పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మరో దేశం’అంటూ ప్రసంగాన్ని ముగించారు. 

దీంతో, పాకిస్తాన్‌ ప్రతినిధి తెల్లబోయి చూస్తుండిపోయారు. ఇలాంటి అనుభవమే పాక్‌కు 2020లోనూ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుడొకరిని ఇస్లామిక్‌ ఉగ్రవాది తలనరికి చంపిన ఘటనపై పాకిస్తాన్‌ ప్రభుత్వం..‘స్వేచ్ఛ పేరుతో దైవ దూషణకు పాల్పడటం సహించరానిది’అంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. దీనిపై జెనీవాకు చెందిన మానవ హక్కుల సంస్థ యూఎన్‌ వాచ్‌ దీటుగా ఇలా స్పందించింది... ‘ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌లో మీకు సభ్యత్వం ఇవ్వడం సహించదగిందే’అంటూ బదులిచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్‌ ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉండటం గమనార్హం.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)