Breaking News

భారత్‌తో స్నేహం కావాలి: పాకిస్తాన్‌

Published on Wed, 06/26/2024 - 07:04

పొరుగుదేశం పాకిస్తాన్‌ తాజాగా భారత్‌తో స్నేహం కోసం పరితపిస్తోంది. నిరంతర శతృత్వాన్ని నమ్మబోమంటూ మిత్రత్వానికి స్వాగతం పలుకుతోంది. స్వయంగా పాక్‌ ఉపప్రధాని తాము భారత్‌తో హృదయపూర్వక స్నేహాన్ని కోరుకుంటున్నామని అనడం ఇందుకు తార్కాణంగా నిలిచింది.

పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్  తాజాగా భారత్‌కు స్నేహ సందేశాన్ని పంపారు. తమ దేశం నిరంతర శత్రుత్వాన్ని నమ్మబోదని ఆయన అన్నారు. భారత్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇస్లామాబాద్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యతనివ్వాలని దార్‌ కోరారు. ఇస్లామాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఎస్‌ఎస్‌ఐ)లో జరిగిన సెమినార్‌లో పీఎంఎల్-ఎన్ నేత, ఉపప్రధాని ఇషాక్‌ దార్‌ ప్రసంగించారు.  

పాకిస్తాన్‌ ఎప్పుడూ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. అయితే భారత్‌తో పాక్‌ సంబంధాలు చరిత్రలో  అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, జమ్ముకశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో  సత్సంబంధాలను కోరుకుంటున్నామని దార్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్‌ కోరుకుంటున్నదన్నారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న అన్ని దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలను కొనసాగించడానికి పాకిస్తాన్  కృషి చేస్తుందని దార్ పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)