పాక్ ప్రతీకార చర్య.. ఇరాన్‌పై వైమానిక దాడులు

Published on Thu, 01/18/2024 - 09:28

ఇస్లామాబాద్: ఇరాన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రతీకార చర్యకు పూనుకుంది. పాకిస్థాన్‌ కూడా ఇరాన్ వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఇరాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో నలుగురు పిల్లలతోపాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. 

బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం జరిపిన దాడుల్లో  ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నివేదించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించింది. 

ఇరాన్ దాడుల్ని పాక్‌ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. ఇరాన్ రాయబారిపై వేటు వేసింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా స్పందించింది.  

ఇదీ చదవండి: పాక్‌ ఉగ్రస్థావరాలపై ఇరాన్‌ దాడులు


 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)