Breaking News

Pakistan: భారీ వర్షాలతో అతలాకుతలం.. పెరిగిన వరద ముప్పు

Published on Mon, 08/05/2024 - 07:35

పాకిస్తాన్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జనం నానా అవస్థలు పడుతున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌ నగర పరిధిలోని కోట్-ముర్తాజా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

పాక్‌లోని బలూచిస్తాన్‌, దక్షిణ పంజాబ్‌లోని పలు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ట్యాంక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో  ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ట్యాంక్-సౌత్ వజీరిస్తాన్ రహదారిని మూసివేయడంతో పాటు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఆగస్టు 4 నుంచి 7 వరకు కరాచీలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని పేర్కొంది. కోహ్-ఎ-సులైమాన్‌లోని రోజాన్‌లోని 100కు పైగా ఇళ్లలోకి వరదనీరు చేరింది. 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాజన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ మీడియాకు తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)