Breaking News

కూలిన పాక్‌ ప్రభుత్వ హెలికాప్టర్.. ఐదుగురు మృతి

Published on Mon, 09/01/2025 - 13:20

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ప్రభుత్వ హెలికాప్టర్‌ ఒకటి హెలీప్యాడ్‌పై టెస్ట్ ల్యాండింగ్ చేస్తుండగా కూలిపోయింది. గిల్గిట్-బాల్టిస్తాన్ (జీబీ)లోని డైమర్ జిల్లాలో గల చిలాస్‌లోని థోర్ ప్రాంతం సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ఐదుగురు మరణించారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
 

మృతులలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారని ఆ అధికారి పేర్కొన్నారు. పర్వత పర్యాటక ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన, హెలిప్యాడ్‌పై టెస్ట్ ల్యాండింగ్ చేస్తుండగా అది కూలిపోయిందని డైమర్ జిల్లాకు  చెందిన సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్ హమీద్ మీడియాకు తెలిపారు.  కాగా డైమర్ జిల్లాలోని చిలాస్ ప్రాంతంలో ఈ హెలీకాప్టర్‌ కూలిపోయిందని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. గత నెలలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఎత్తైన శిఖరాలు, మారుమూల లోయలకు ప్రసిద్ధి చెందిన గిల్గిట్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ వ్యూహాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రంగా నిలిచింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)