Breaking News

పాక్‌ నకిలీ  ఫుట్‌బాల్‌ జట్టు వెనక్కి 

Published on Thu, 09/18/2025 - 06:36

లాహోర్‌: చిట్టడవులు, కొండ ప్రాంతాలు, సరిహద్దు గుండా ఉగ్రవాదులను పాకిస్తాన్‌ అక్రమంగా భారత్‌లోకి పంపిస్తుంటే.. ఇదే స్ఫూర్తితో ఒక పాకిస్తానీయుడు తోటి పాకిస్తానీయులను మోసం చేసి జపాన్‌కు పంపించాడు. ‘గోల్డెన్‌ ఫుట్‌బాల్‌ ట్రయల్‌’ పేరిట ఫుట్‌బాల్‌ క్లబ్‌ బృంద సభ్యులుగా జపాన్‌లోకి అడుగుపెట్టిన ఈ నకిలీ ఆటగాళ్లను జపాన్‌ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అనుమానంతో ఆపేశారు.

 అట్నుంచి అటే మళ్లీ పాకిస్తాన్‌కు తిరుగుటపా చేశారు. 15 రోజుల తాత్కాలిక పాక్‌ వీసాతో జపాన్‌కు వచి్చన 22 మందిని వెనువెంటనే తిరిగి పంపించిన ఘటన జూన్‌లో జరగ్గా చాలా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫుట్‌బాల్‌ టీమ్‌ అంశాన్ని పాకిస్తాన్‌ దర్యాప్తు సంస్థ.. ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ సీరియస్‌గా తీసుకుంది. 22 మందిని జపాన్‌కు పంపిన మానవ అక్రమ రవాణా కేసులో మాలిక్‌ వకాస్‌ను ఎఫ్‌ఐఏ అధికారులు అరెస్ట్‌చేశారు.  

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలాగే 
ఫుట్‌బాల్‌ ఆటగాళ్లమాదిరే నిజమైన టీమ్‌ జెర్సీ దుస్తుల్లో జపాన్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే తర్వాత వీళ్ల ధోరణి చూసి జపాన్‌ ఇమిగ్రేషన్‌ అధికారులకు అనుమానమొచ్చి వీళ్లను లోతుగా ప్రశ్నించి అసలు విషయంరాబట్టారు. పాక్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారుల కళ్లుగప్పి ఇక్కడిదాకా ఎలా రాగలిగారనే ప్రశ్న జపాన్‌ అధికారులను తొలచేస్తోంది. పాకిస్తాన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అధికారులతో మాలిక్‌ వక్రాస్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జపాన్‌కు పంపేందుకు ఈ ఒక్కో అక్రమ వలసదారుడి నుంచి కనీసం 45 లక్షల పాక్‌ రూపాయలను వసూలుచేసినట్లు తెలుస్తోంది. మాలిక్‌ జపాన్‌కు ఇలా గతంలోనూ కొందరిని తరలించాడని సమాచారం. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 17 మందిని జపాన్‌కు తరలించాడు. ఈ విషయంలో గత ఏడాది జనవరిలో వెలుగులోకి వచి్చంది. అప్పుడు వెళ్లిన వాళ్లెవరూ తిరిగి పాక్‌కు రాలేదు.  
 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)