Breaking News

మా వాళ్ల దగ్గర కండోమ్‌లు కొనడానికి డబ్బుల్లేవు: పాక్ ఆర్థిక మంత్రి

Published on Tue, 02/17/2026 - 14:14

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ఈ దేశం పేరు వింటే చాలు సీమాంతర ఉగ్రవాదం, హింస, మతతత్వవాదం ఇవే గుర్తుకొస్తాయి. భారత్‌తో సమకాలీకంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఆ దేశం హింసనే నమ్ముకుంది. పక్క దేశాలపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ హింసతో ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేసే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక అభివృద్ధిని మరచిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలోని ప్రజలు కండోమ్‌లు కొనడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

పాకిస్థాన్‌కు దెబ్బమీద దెబ్బపడుతోంది. ఇటీవల భారత్‌, ఈయూతో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అక్కడి ఎగుమతులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వార్త ఆ దేశాన్ని కలవర పెడుతోంది. పాకిస్థాన్‌లో జనాభా నియంత్రణ లేక విపరీతంగా జననాలు పెరుగుతున్నాయని.. తద్వారా పేదరికం సంభవిస్తుందని.. అందుకే పేదరికాన్ని నియంత్రించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.

అందుకోసమే గర్భనిరోధాకాలైన కండోమ్‌ల ధర తగ్గించాలని భావించింది. అయితే ప్రస్తుతం పాక్‌కు ఐఎ‌ంఎఫ్‌ ఆర్థిక సాయం అందిస్తుండడంతో విధాన పరమైన నిర్ణయాల్లో దాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ధరలు తగ్గించాలని ఐఎ‌ంఎఫ్‌ను కోరగా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా పన్నులు తగ్గించడం సాధ్యం కాదని అవసరమైతే వచ్చే ఏడాది బడ్జెట్‌లో కోతలు విధించాలని తెలిపింది. దీంతో కండోమ్‌ల ధర తగ్గించలేకపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్ ఆర్థిక మంత్రి జౌరంగజేబు మీడియాకు తెలిపారు. దీంతో.. ‘పాక్‌లో ప్రజల వద్ద కండోమ్‌లు కొనేంత డబ్బు కూడా లేదు’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అవుతోంది.

ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో పాకిస్థాన్ అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించాలని సర్వే తెలిపింది. పాక్‌ జనాభా త్వరలో 40 కోట్లకు చేరుకుంటుంది. అయితే  అభివృద్ధిలో ఆ దేశం వెనుకబాటులో ఉంది. ఆ దేశ మెుత్తం ఐటీ ఎగుమతులు మన కేరళతో పోలిస్తే తక్కువ ఉ‍న్నాయంటే టెక్నాలజీలో పాక్‌ ఏ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)