Breaking News

క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్‌

Published on Fri, 04/25/2025 - 05:16

ఇస్లామాబాద్‌: సరిహద్దు వెంట తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్‌ పహల్గాం ఉదంతం తర్వాత సైతం తన బుద్ధిని మార్చుకోలేదు. తాజాగా కరాచీ తీరం వెంట క్షిపణి పరీక్షను చేపట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు తూర్పున ఉన్న కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించి క్షిపణిని పరీక్షించనున్నట్లు ఒక నోటీస్‌ను జారీచేసింది. 

అరేబియా సముద్రంలో తమ పరిధిలోని సముద్రజలాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలు లేకుండా నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఆ పరిధిలో నావికులు సంచరించకూడదని హెచ్చరించింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్‌ను పరీక్షంచనుంది. పాక్‌ తన ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌(ఈఈజెడ్‌)ప్రాంతంలో ఏప్రిల్‌ 25వ తేదీన ఈ క్షిపణి పరీక్ష చేపట్టే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉదంతంపై ఆగ్రహంతో భారత్‌ తమపై ప్రతీకార దాడులకు దిగితే తాము కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేప్పేందుకే పాకిస్తాన్‌ ఇలా క్షిపణి పరీక్షలకు దిగిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)