Breaking News

ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్‌ సర్కార్‌.. పీవోకేతో ఒప్పందం

Published on Sun, 10/05/2025 - 08:45

ఇస్లామాబాద్‌: గత వారం రోజులుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగుతున్న నిరసనోద్యమాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మొదటి మిలిటరీని పంపి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించి విఫలమైన షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం.. చివరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్ముకశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (జేకేజేఏఏసీ)తో ఒప్పందం చేసుకుంది.

ఈ క్రమంలో 25 అంశాలతో కూడిన ఒప్పందం ప్రతిని పాక్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్‌ ఫజల్‌ చౌదరి శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గత నెల 29 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 10 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముజఫరాబాద్‌కు షహబాజ్‌ షరీఫ్‌ గత బుధవారం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపారు. వారు జేకేజేఏఏసీ నేతలతో రెండు రోజుల పాటు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం పాక్‌ ప్రభుత్వం పీవోకేలోని ముజఫరాబాద్, పూంచ్‌లలో అదనంగా ఇంటర్మీడియట్, సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డులను ఏర్పాటుచేస్తుంది.  

అలాగే, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు స్థానిక ప్రభుత్వం 15 రోజుల్లోగా హెల్త్‌ కార్డు అమలుకు నిధులు మంజూరు చేయాలి. పీఓకేలో విద్యుత్‌ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు అందించాలి. పీఓకే అసెంబ్లీ సభ్యుల అంశంపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ చర్చించాలి. ఆస్తి బదిలీలపై పన్నును 3 నెలల్లోగా పంజాబ్‌ లేదా పంఖ్తుఖ్వాలతో సమానంగా తీసుకురావాలి. ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించి అమలుచేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటుచేస్తారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)