Breaking News

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం.. ‘ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి మీ పనే’..

Published on Sun, 06/29/2025 - 08:56

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి 13మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనను పాకిస్తాన్‌ భారత్ పైకి నెట్టేసింది. తమ దేశ సైనికుల మరణానికి భారత్‌ కారణమని ప్రచారం చేస్తోంది. అయితే, పాక్‌ ప్రచారాన్ని భారత్‌ ఖండించింది. పాక్‌ చేస్తున్న ప్రచారం ఆమోదయోగ్యం కాదంటూ ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. 

జూన్‌ 28న  పాక్‌ ఉత్తర వజీరిస్తాన్ జిల్లా  ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని ఓ అగంతకుడు  పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీ కొట్టారు. ఈ  ఘటనలో 13మంది ఆర్మీ సైనికులు మరణించగా..10 మంది గాయాలయ్యాయి. 13 మంది సాధారణ పౌరులు గాయపడినట్లు ప్రముఖ పాక్‌ మీడియా సంస్థ డాన్‌ తెలిపింది.  

 

ఈ దాడి వెనక భారత్‌ ఉందంటూ పాకిస్తాన్‌ అధికారంగా చేసిన ప్రకటనను ఖండించింది. వజీరిస్తాన్‌లో పాక్‌ ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్‌ ప్రమేయం ఉందని పాక్‌ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటనను మేం ఖండిస్తున్నాం. ఆమోదయోగ్యం కాదని..విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 

పాక్‌ మీడియా ఏమంటోంది 
దక్షిణ వజీరిస్తాన్‌లో నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో ఇద్దరు సైనికులు మరణించి, 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని డాన్ పేర్కొంది. పలు నివేదికల  ప్రకారం, 2021లో కాబూల్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి  వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. తమ దేశంలో తమ గడ్డను ఉపయోగించుకొని దాడులకు తెగబడుతోందని తాలిబాన్ల ప్రభుత్వంపై పాక్‌ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఆరోపణల్ని తాలిబాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు.  

కాగా,ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)