Breaking News

యూఎన్‌వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు

Published on Tue, 05/06/2025 - 10:33

యూఎన్‌వో సమావేశంలో పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఉగ్రదాడిని యూఎన్‌వో తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్‌ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్‌ను యూఎన్‌వో ఆరాతీసింది. ప్రత్యేకంగా ఒక మతం వారినే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ క్షిపణి పరీక్షలపై యూఎన్‌వో ఆందోళన వ్యక్తం చేసింది

పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత్‌ చర్యలపైనే ఫోకస్‌ పెట్టిన పాక్‌.. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో ప్రస్తావించింది. భారత్‌, పాకిస్థాన్‌ సంయమనం పాటించాలని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. భద్రతామండలిలో భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన పాకిస్తాన్‌.. భారత్‌ చర్యలను తప్పు బట్టే ప్రయత్నం  చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది.

భారత్, పాక్‌ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు.

సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్‌లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.

 


 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)