Breaking News

పాక్‌ దాడులు.. 11 మంది చిన్నారులు మృతి

Published on Wed, 06/10/2026 - 13:49

కాబూల్‌: పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నిన్న ( మంగళవారం)  రాత్రి తాలిబన్ల భూభాగంపై పాక్‌ వైమానిక దాడులతో విరుచుకపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నట్లు అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. చిన్నారులు నిద్రపోతున్న సమయంలో దాడులు చేయడంతో వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ దేశ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొద్ది కాలంగా అఫ్గానిస్థాన్‌- పాక్‌ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి ని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకున్నాయని పాక్‌ వైమానిక దళం విరుచుకపడింది. అయితే ఈ దాడిపై అఫ్గాన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ "నిన్న రాత్రి, పాకిస్తానీ సైన్యం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించి, కునార్, ఖోస్ట్ మరియు పక్తికా ప్రావిన్సులలోని పౌరుల ఇళ్లపై బాంబులు వేసింది. దీని ఫలితంగా  11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారు.మరో 14 మంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.బాధితులు నిద్రిస్తున్న సమయంలో రాత్రిపూట దాడులు జరిగాయి., దీంతో బాంబు దాడుల నుండి తప్పించుకోవడానికి వారికి ఏమాత్రం అవకాశం లభించలేదు. ఇది పూర్తిగా అమానవీయం" అని అన్నారు

అదే విధంగా గత కొద్దికాలంగా పాక్‌ దాడుల్లో మృతిచెందిన చిన్నారులతో కూడిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. కాగా పాక్‌ జరిగిన దాడుల్లో మెుత్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)