Breaking News

తాలిబన్లకు భారీ షాక్‌..

Published on Thu, 03/05/2026 - 07:02

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లోని బగ్రాం ఎయిర్‌ బేస్‌పై పాకిస్తాన్‌ భారీ వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ ప్రభుత్వ టీవీ బుధవారం ఈ విషయం వెల్లడించింది. అఫ్గాన్‌ తాలిబన్లు పాకిస్తాన్‌తో 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని 53 ప్రాంతాల్లో దాడులకు తెగబడటంతో పాక్‌ ఆర్మీ ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ఘజబ్‌ లిల్‌ హక్‌ పేరుతో భారీ ఆపరేషన్‌ ప్రారంభించింది.

అందులో భాగంగానే బగ్రాం వైమానిక స్థావరంపై తీవ్ర దాడులు జరిగాయని, అఫ్గాన్‌ తాలిబన్ల దురాక్రమణ చర్యలకు తగు బుద్ధి చెప్పామని పాక్‌ టీవీ పేర్కొంది. ఎయిర్‌బేస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని, అందులోని ఓ హంగార్, రెండు గిడ్డంగులు ధ్వంసమయ్యాయంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఉటంకించింది. వారం రోజుల వ్యవధిలో అఫ్గానిస్తాన్‌లోని సైనిక లక్ష్యాలపై 50కి పైగా వైమానిక దాడులు జరిగాయని తెలిపింది. తాలిబన్లపై ఇలాంటి దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని హెచ్చరించింది.

టీటీఏ కమాండర్‌ హతం
పెషావర్‌: సరిహద్దులోని తోర్ఖామ్‌ వద్ద పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కీలక ఆపరేషన్‌లో ఆఫ్ఘన్‌ తాలిబన్‌ కమాండర్‌ (టీటీఏ) కహ్రామాన్‌ హతమయ్యారు. ఈ ఘటనలో కమాండర్‌తో పాటు అతని అనుచరులు కూడా మరణించారు. తోర్ఖామ్, పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌. పాకిస్తాన్‌ భూభాగంలోకి చొరబడి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న తాలిబన్లు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్‌ ప్రభుత్వం తెలిపింది. సరిహద్దును చేరుకోవడానికి వారు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని, భద్రతా దళాలు చేసిన దాడిలో ఖహ్రామాన్, అతని సహచరులు అనేక మంది మరణించారని వెల్లడించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రధాన ఆపరేషన్‌లో మొత్తం 67 మంది ఆఫ్ఘన్‌ తాలిబన్లను చంపినట్లు పాకిస్తాన్‌ భద్రతా దళాలు పేర్కొన్నాయి.   

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)