Breaking News

ఆఫ్ఘనిస్థాన్‌పై విరుచుకుపడిన పాకిస్తాన్‌.. ఆకస్మిక దాడులు

Published on Sun, 02/22/2026 - 07:23

కాబూల్‌: దాయాది దేశం పాకిస్తాన్‌, తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్‌ బోర్డర్‌లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్‌.. ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిగింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది వరకు మరణించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

అయితే, పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఆప్ఘన్‌ ఉగ్రవాదుల స్థావరాలను పాకిస్తాన్‌ టార్గెట్‌ చేసింది. ఇందులో భాగంగా ఆప్ఘన్‌ సరిహద్దు సమీపంలోని పలు ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. తెహ్రిక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. 

కాగా, ఆప్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్, పాక్టికా, ఖోస్ట్‌ ప్రావిన్సులలో ఈ దాడులు జరిగాయని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. ఆప్ఘనిస్తాన్‌లోని మదర్సా, డెయిరీ ఫామ్‌, ప్రజల ఇళ్లలో బాంబు దాడుల కారణంగా దాదాపు 30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. ఇక, పాకిస్తాన్ దాడులు జరిగిన ఖచ్చితమైన స్థానాన్ని పేర్కొనలేదు. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్థాన్ హెచ్చరికలు జారీ చేసింది. 


మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దు దాడులను నిరోధించడంలో విఫలమైందని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే. ​కాగా, పాకిస్తాన్‌ ఆరోపణను కాబూల్ ఖండించింది. ఇటీవలి కాలంలో పదేపదే ఘర్షణలు, సరిహద్దు మూసివేతల కారణంగా ఇప్పటికే రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. పాక్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు, ఐదుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులు ఉన్నట్లు సమాచారం. చాలామంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లో 15 రోజుల్లోనే ఇది మూడో ఆత్మాహుతి దాడి. ఐదు రోజుల్లో రెండోది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)