Breaking News

పాక్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి

Published on Sat, 11/04/2023 - 12:19

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తెహ్రిక్‌ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) సంస్థతో పాక్‌ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కిందటి ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. తాజాగా శనివారం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే సైన్యం అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పింది. 

శనివారం ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్‌ ఎయిర్‌ ఫోర్స్ (పీఏఎఫ్‌) ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పేర్కొంది.  కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్‌ సైనికుడు వీరమరణం పొందారని.. పలువురికి గాయాలయ్యాయని ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది.

దాడికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. అయితే.. ఇది బెలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) పనేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. బీఎల్‌ఏ.. పాక్‌ నుంచి స్వాతంత్రం కోరుతూ 2004 నుంచి పోరాడుతోంది. సాధారణ పౌరులనే కాకుండా.. ఈ ఏడాది జూన్‌లోనూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా దాడికి పాల్పడింది.

ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే.. గత ఆరునెలలుగా పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి.

అయితే ఈ దాడులు పాక్‌ భద్రతకు ముప్పుగా మారడమే కాదు.. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌లను ప్రోత్సహిస్తూ పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలను తోసిపుచ్చుతున్న పాక్‌.. తాము ఉగ్ర పీడిత దేశమేనని చెప్పుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు చేపట్టాలంటూ పాక్‌ను కోరుతున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)