Breaking News

పాకిస్తాన్‌: నవంబర్‌లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతం

Published on Mon, 12/02/2024 - 07:52

పెషావర్‌: పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్థాన్‌ ప్రావిన్సుల్లో నవంబర్‌లో సైన్యం జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులంతా తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధం కలిగినవారు.

ఇటీవల తీవ్రవాద గ్రూపుల దాడులను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలు తీవ్రవాద గ్రూపులపై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ల కింద నవంబర్ నెలలో 199 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వీరిలో నిషేధిత సంస్థలకు చెందిన 24 మంది కీలక కమాండర్లు ఉన్నారన్నారు. హతమైన కమాండర్లలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని, వీరి కోసం చాలా కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.

మరోవైపు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మతపరమైన హింసలో మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 130కి పెరిగింది. కుర్రం జిల్లాలో వరుసగా పదకొండో రోజు కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అలీజాయ్- బగన్ తెగల మధ్య ఘర్షణలు నవంబర్ 22న ప్రారంభమయ్యాయి. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, హింస కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)