Breaking News

ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్‌.. నామినేషన్‌ తిరస్కరణ

Published on Sat, 12/30/2023 - 19:27

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ ఎ‍న్నికల సంఘం షాక్‌ ఇచ్చింది.  2024లో జరగబోయే పాకిస్తాన్‌ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు ఆయన నామినేషన్‌ పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం తిరస్కరించిందని ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ స్వస్థలమైన మియాన్వాలి నుంచి ఆయన పోటీ చేయడానికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.​ ఇక ఆయన అధికార రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించబడినందుకే నామినేషన్‌ను తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇక ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌  పాకస్తాన్‌ లెక్కల ప్రకారం.. 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 28, 626 మంది తమ నామినేషన్లను దాఖలు చేసిట్లు పేర్కొంది. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ పలు కేసుల్లో  జైల్లో ఉన్నాడని.. పాకిస్తాన్‌ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి జైలు నుంచి బయటకు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పీటీఐ పార్టీ వర్గాలు చర్చించుకోవటం గమనార్హం. కాగా.. సాధరాణ ఎన్నికల సమయంలో తనను జైలులోనే ఉంచడానికి తనపై తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

చదవండి: ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)